Current Date: 12 Mar, 2025

ఘనంగా పారమ్మ కొండపై సుబ్రహ్మణ్యం శ్రీవల్లి దేవసేన కళ్యాణం...

సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పెద్ద చీపురు వలస పంచాయతీ పరిధిలో వెలసిన పారమ్మ తల్లి కొండపై సుబ్రమణ్య స్వామి శ్రీ వల్లి దేవసేన అమ్మవార్ల కళ్యాణం సతీసమేతంగా  కోట చైతన్య, సౌమ్య దంపతులు సనాతన ధర్మ పరిషత్ వ్యవస్థాపకులు వెలవలపల్లి పంచ ముఖేశ్వర శర్మ  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సాలూరు పట్టణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ వల్లి దేవసేన పూజలు శ్రీ కామాక్షి దేవి ఏకాంబేశ్వర స్వామి ఆలయంలో ముద్దు సత్యం గురువు, శ్రీ పంచముఖేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మాజీ శర్మ, అయ్యప్ప స్వామి ఆలయంలో విజ్జు శర్మ, కోట దుర్గ దేవి ఆలయంలో శ్రీను శర్మ,  కన్యక పరమేశ్వరి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు హేమంత్ శర్మ ఘనంగా  రమ్యంగా నిర్వహించారు.

Share