Current Date: 12 Mar, 2025

నో విక్టరీ పరేడ్.. సైలెంట్‌గా ఇళ్లకి భారత క్రికెటర్లు

ఛాంపియన్స్ ట్రోఫీ -2025 విజేతగా నిలిచిన టీమిండియా.. సైలెంట్‌గా దుబాయ్ నుంచి భారత్‌కి చేరుకుంది. వరల్డ్‌కప్‌కి ఏ మాత్రం తీసిన ఈ టోర్నీలో విజేతగా నిలిచినందుకు భారత్ ఆటగాళ్లకి స్వదేశంలో ఘన స్వాగతం పలకాలి. అలానే విక్టరీ పరేడ్ నిర్వహించాలని కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొలుత ప్లాన్ చేసింది.గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచి స్వదేశానికి వచ్చాక ముంబైలో విక్టరీ పరేడ్‌ను బీసీసీఐ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఇలానే నిర్వహిస్తారని అభిమానులు భావించారు. కానీ.. అలాంటి వేడుకలు ఏమీ లేవని బీసీసీఐ తేల్చేసింది.మార్చి 22 నుంచే ఐపీఎల్ -2025 ప్రారంభం కానుండగా ఈ సమయంలో ఆటగాళ్లు విరామాన్ని కోరుకుంటున్నారు. దీంతో పరేడ్ నిర్వహిస్తే కష్టమని బీసీసీఐ భావించింది. దాంతో దుబాయ్ నుంచి భారత్ ఆటగాళ్లు సైలెంట్‌గా..  విడివిడిగా ఇళ్లకు చేరుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు.

Share