జర్నలిస్టుగా అపార అనుభవంతో వి.వి.రమణమూర్తి నెలకొల్పిన పత్రిక లీడర్. ఉత్తరాంధ్ర గుండె చప్పుడుగా సద్గురు శ్రీ శివానందమూర్తి గారి ఆశీస్సులతో 1999 జూలై 29న లీడర్ ప్రారంభమైంది. అనతికాలంలోనే పెద్ద పత్రికలకు ధీటుగా ప్రజాభిమానాన్ని చూరగొంది. ఎక్కడ ఏ సమస్య వున్నా అక్కడ లీడర్ తనదైన రీతిలో ప్రజలకు అండగా నిలిచేది. ఇప్పటికీ నిలుస్తోంది.కేవలం వార్తను రాయడమే కాకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ వెంటాడడం లీడర్ లక్షణం. ఎన్నో కుంభకోణాలను బయట పెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కాపాడిన పత్రిక ‘లీడర్’. ఏ రాజకీయ పార్టీకీ కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన నిలుస్తూ ఉత్తరాంధ్రలోనే కాకుండా యువత తెలుగు ప్రజల ప్రసంశలు పొందుతున్న పత్రిక ‘లీడర్’. పత్రిక ఎడిటర్ వి.వి.రమణమూర్తి 1979లో ఆంధ్రజ్యోతి గౌరవ విలేకరిగా జర్నలిజంలోకి ప్రవేశించారు. ఉదయం, వార్త, వంటి ప్రముఖ పత్రికల్లో ఉన్నత స్థానంలో పని చేసి అనేక సంచలన వార్తల్ని అందించారు. ప్రముఖ నక్సల్ లీడర్, పీపుల్స్‌వార్ నేత కొండపల్లి సీతారామయ్యను ఉదయం పత్రిక కోసం ఇంటర్వ్యూ చేసిన ఏకైక జర్నలిస్టు రమణమూర్తి. అంతేకాదు ఏలేరు భూ కుంభకోణాన్ని బయటపెట్టి 1994 ప్రాంతంలోనే ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఆదా చేసిన జర్నలిస్టు రమణమూర్తి. ఇలాంటి ఎన్నో కధనాలను అందించి ప్రభుత్వం కళ్ళు తెలిపించడమే కాకుండా ప్రజలను చైతన్య పరచడంలో విశేష పాత్రను పోషించిన జర్నలిస్టు రమణమూర్తి. అంతే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్నార్తులకు అండగా నిలుస్తున్న జర్నలిస్టు రమణమూర్తి. కళాకారులకు, రచయితలకు, కవులకు అండగా నిలవడం కోసం రైటర్స్ అకాడమీని స్థాపించి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న జర్నలిస్టు రమణమూర్తి. అంతేకాదు లీడర్ పీపుల్ సర్వీసు ట్రస్టు ద్వారా కేజీహెచ్ ఆసుపత్రిలో రోగుల సేవకులకు ఉచిత భోజనం, నిరుపేదలను చదివించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న జర్నలిస్టు రమణమూర్తి. లీడర్ రమణమూర్తిగా ప్రాచుర్యం పొందిన రమణమూర్తి సారధ్యంలోని ‘లీడర్’ ఇప్పుడు వెబ్ మీడియా ద్వారా మరింత మందికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. మీ నిండు మనస్సుతో ఆశీర్వాదించాలని మనసారా కోరుకుంటున్నాను.