టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఈరోజు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన శ్రీవారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్‌కు వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, ఈరోజు నితిన్ నటించిన కొత్త సినిమా 'రాబిన్‌హుడ్' థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నితిన్ సరసన కథానాయికగా యంగ్ బ్యూటీ శ్రీలల నటించగా... ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించడం విశేషం.