ఐపీఎల్ 2025 సీజన్లో ఉత్కంఠ మ్యాచ్ల హవా మొదలైంది. గత వారం నుంచి ఏకపక్షంగా మ్యాచ్లు ముగుస్తుండటంతో.. అభిమానులు ఒకింత నిరాశకి గురవుతున్నారు. కానీ.. ఆదివారం రాత్రి గౌహతి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. చివరి బంతి వరకూ పోరాడిన రాజస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో చెన్నై టీమ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేయగలిగింది. చెన్నై విజయానికి ఆఖరి 18 బంతుల్లో 45 పరుగులు అవసరం అవగా.. క్రీజులో ఉన్న ధోని 11 బంతుల్లో 16 పరుగులే చేసి ఆఖరి ఓవర్లో ఔటైపోయాడు. వాస్తవానికి జడేజా తాను హిట్టింగ్ చేస్తానన్నా.. ఆఖరి ఓవర్ వరకూ ఆగాంటూ ధోనీ సైగలు చేస్తూ కనిపించాడు. కానీ.. ఫైనల్ ఓవర్లో చెన్నై విజయానికి 20 పరుగులు అవసరం అవగా.. ధోనీ తొలి బంతికే ఔటైపోయాడు. దాంతో సమీకరణాలు మారిపోయాయి. జడేజా లాస్ట్ ఓవర్లో హిట్టింగ్ చేయలేకపోయాడు.
Share