ఏపీలో 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. మొత్తం సభ్యులతో కలిసి 705 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నేతలకు దక్కాయి. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు. కాగా, అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం గమనార్హం.