ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలను ప్రతిపాదించామని శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ వెల్లడించారు. స్పెషల్ నీడ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారని.. వారి అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు సంస్థలు కొన్ని రూ.50 వేలు కూడా వసూలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు.
Share