టాలీవుడ్ బ్యూటీ సమంత తారజువ్వలా దూసుకుపోతోంది. వ్యక్తిగతంగానూ, కెరీర్ పరంగానూ స్పీడ్ చూపిస్తోంది. దీంతో బ్యూటీ క్రేజ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. అంతేకాక మరింత స్పీడ్ పెంచింది. ఊహించని రీతిలో స్టార్ స్టేటస్ తో ముందుకు సాగుతోంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటించడంతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో కెరీర్ ను ఫుల్ ఫామ్ లోకి తీసుకొస్తున్న బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. సోషల్ మీడియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న సమంత గురించి ఏ అప్ డేట్ వచ్చిన వైరల్ గా మారిపోతోంది. మొన్నటి వరకు... పోస్టులు, కౌంటర్లు, వేదాంతంతో వార్తల్లో నిలిచిన బ్యూటీ... ఇప్పుడు మరో వార్తతో హెడ్ లైన్స్ లో నిలిచింది. ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్ తో బాలీవుడ్ దర్శకుల జోడీ రాజ్ అండ్ డీకేతో పనిచేసింది సామ్. ఫ్యామిలీ మ్యాన్ తర్వాత యాక్షన్ స్పై థ్రిల్లర్ సిటడెల్ తెలుగు వర్షన్ హనీ బన్నీలో నటించింది. కట్ చేస్తే ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరితో సమంత డేటింగ్ చేస్తున్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Share