జిల్లాలోని దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధి కొరకు స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ల స్థాపన, జెనరిక్ ఫార్మసీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సం.రంలో 21 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేదలు ( ఈడబ్ల్యూఎస్ - కమ్మ, రెడ్డి,ఈ.బి.సి., క్షత్రియ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ అభివృద్ధి కొరకు స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటుకు, డి-ఫార్మసీ, బి-ఫార్మసీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత జెనరిక్ ఫార్మసీల ఏర్పాటుకు 21 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న కాపు (కాపు, తెలగ, బలిజ, ఒంటరి) కులములు వారికి సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను అర్హత మేరకు కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Share