Current Date: 12 Mar, 2025

పాక్‌లో సైనికులున్న ట్రైన్‌ను హైజాక్.. 30 మందిని కాల్చివేత

ట్రైన్ హైజాక్ ఇప్పుడు పాకిస్థాన్‌ను కుదిపేస్తోంది. బలూచీ వేర్పాటువాదులు ప్రావిన్సులో దాదాపు 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును హైజాక్‌ చేసేశారు. ఈ ప్రయాణికుల్లో సగానికి పైగా సైనికులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రైన్ హైజాక్ తమ పనేనని నిషేధిత బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించుకుంది 500 మంది ప్రయాణికుల్లో కనీసం 30 మందిని కాల్చి చంపేశామని.. ఇంకా 215 మందిని బందీలుగా పట్టుకున్నామని ప్రకటించింది. హైజాక్‌పై జోరుగా చర్చ జరుగుతున్నా.. పాక్‌ ప్రభుత్వం అధికారికంగా స్పందించేందుకు జంకుతోంది. ఘటనా స్థలిని సైనిక హెలికాప్టర్లు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టాయి.కానీ..సైనిక చర్యను తక్షణం నిలిపేయకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ పాక్‌ సర్కారును తీవ్రంగా హెచ్చరించింది. రాజకీయ ఖైదీలుగా నిర్బంధించిన బలూచీ నేతలు, కార్యకర్తలందరినీ 48 గంటల్లోపు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.

Share