Current Date: 12 Mar, 2025

బెయిల్ వచ్చినా పోసాని విడుదలపై సందిగ్ధత.. మళ్లీ అరెస్ట్?

సినీ నటుడు పోసాని కృష్ణమురళి బుధవారం విడుదలపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి కర్నూలు మొదటి అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్, ఆదోని న్యాయస్థానం ఇన్‌ఛార్జి న్యాయాధికారి అపర్ణ మంగళవారం బెయిల్‌ మంజూరు చేశారు. కానీ.. భవానీపురం పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో విచారించిన విజయవాడ కోర్టు.. గత వారం ఆయనకు ఈనెల 20 వరకు రిమాండు విధించింది. కొన్ని కేసుల్లో హైకోర్టు కూడా బెయిల్‌ ఇచ్చింది. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్న నేపథ్యంలో ఆయన విడుదలయ్యేలోపు ఇతర జిల్లాల నుంచి ఏ స్టేషన్‌ పోలీసులైనా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే పలు స్టేషన్లకి తిప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌లను అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై కేసులు నమోదయ్యాయి.

Share