శ్రీశ్రీశ్రీ సామలమ్మ తల్లి పండగ లో భాగంగా శివాలయానికి వెళ్లే మార్గంలో వీరభద్రుని ప్రభ చెట్టుని పూజ చేసి అనంతరం చెట్టును సాలూరు పట్టణంలో ఘనంగా ఊరేగించారు. వీరభద్ర స్వామి ప్రభ పూజారి జాడ మహేష్ పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం చెట్టును వేణుగోపాల స్వామి ఆలయం, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్డు, బోసు బొమ్మ సెంటర్, డబ్బి వీధి కే హెచ్ స్కూల్, దబ్బీవీధి రామ మందిరం, పెదకోమటిపేటవీధి, కోట జంక్షన్ మీదుగా మెంటాడ వీధి రామ మందిరం వరకు భారీ ఊరేగింపు చేశారు. ఈ కార్యక్రమం మెంటాడ వీధి పెద్దలు, ప్రజలు, పట్టణ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ పెద్దలు, మెంటాడ వీధి పెద్దలు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share