Current Date: 12 Mar, 2025

శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు కూడా ఐటీ దాడులు

హైదరాబాదులోని మాదాపూర్ లో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అదే సమయంలో, తెలంగాణతో పాటు ఏపీ, చెన్నై, ముంబయి, బెంగళూరు, ఢిల్లీలో కూడా శ్రీ చైతన్య కాలేజీల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఈ దాడుల్లో రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అధికారులు శ్రీ చైతన్య విద్యాసంస్థల లావాదేవీల సాఫ్ట్ వేర్ ను పరిశీలించారు. విద్యా సంస్థల టాక్స్ చెల్లింపులపై ఐటీ శాఖ ఆరా తీస్తోంది. రసీదులు ఇవ్వకుండా అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజులు భారీగా వసూలు చేస్తున్నట్టు, అదే సమయంలో పన్నులు ఎగ్గొడుతున్నట్టు గుర్తించారు.

Share