Current Date: 12 Mar, 2025

ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన వాయు కాలుష్యం...

ఢిల్లీ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టింది. దీంతో విద్యా సంస్థల్లో ఫిజికల్ క్లాసులు నిర్వహించేందుకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 187 పాయింట్లుగా నమోదైంది. మరోవైపు వాయు కాలుష్య తీవ్రత 300 పాయింట్లకు దిగువకు రావడంతో సుప్రీంకోర్టు గ్రాప్ 3, 4 ఆంక్షలను సడలించింది. అయితే గ్రాప్ 1, 2పై మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్టేజ్ 2 కింద.. హోటళ్లు, రెస్టారెంట్లు, ఓపెన్ ఈటరీలు, బొగ్గు, కట్టెల వాడకంపై నిషేధం ఉంటుంది. రాజధాని ప్రాంతంలో హైవేలు, ఫ్లైఓవర్లు , పైప్‌లైన్‌ల వంటి పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లతో సహా అన్ని నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలు కూడా నిషేధించబడ్డాయి.

Share