బొబ్బిలిలో శోభ యాత్రలో పాల్గొన్న శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీ మన్నారాయణ జీయర్ స్వామి, వారి శిష్య బృందం తో సంస్థాన్ హై స్కూల్ గ్రౌండ్ కు చేరుకొని పాదుకా పట్టాభిషేకం కడు రమ్యంగా నిర్వహించారు. బొబ్బిలి కోటలో బ్రిటిష్ కాలంలో ఉపయోగించిన యుద్ధ సామాగ్రిని మరియు ఎగ్జిబిషన్ ఫొటోస్ ను వారు తిలకించారు. బొబ్బిలి ఎమ్మెల్యే యువరాజ్ బేబీ నాయనా స్వయంగా స్వామిని వారి శిష్య బృందాన్ని స్వయంగా తీసుకొని వెళ్లి చూపించడం ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. బొబ్బిలి పట్టణంలో రెండు రోజుల నుండి ఆధ్యాత్మిక శోభ స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి రాజావారు సుజీయ కృష్ణ రంగారావు, చిన్న సోదరుడు రామకృష్ణ రంగారావు, ఎమ్మెల్యే యువరాజ్ ఆర్ వి ఎస్ కే కె రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిచే తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఈ పాదుకా పట్టాభిషేకంలో వేల సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు.
Share