Current Date: 17 Mar, 2025

తాగి వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. తెలంగాణ కఠిన నిర్ణయం

మద్యం తాగి వాహనాలు నడపటం నేరం. అయినా చాలా మంది మద్యం మత్తులో వెహికల్స్ నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్ లంగర్‌హౌజ్ ప్రాంతంలో మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. బైకుపై వెళ్తున్న దంపతులతో పాటు ఆటోపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో దంపతులు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు డిసైడ్ అయ్యారు.మద్యం మత్తులో వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదు చేయటంతో పాటుగా లైసెన్స్ రద్దు చేసేందుకు సిద్ధమయ్యారు. అధిక వేగం, బరువుతో గూడ్స్ వెహికల్స్ నడిపినా లెసెన్స్‌లు రద్దు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఎక్కడిక్కడ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి కేసులు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్, ఇతర కేసుల్లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లెసెన్స్ రద్దు చేసే అధికారం రవాణా శాఖ అధికారులకే ఉంటుంది. 

Share