ఏపీలో ఈరోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంగ్లీష్ మీడియం, ఎన్సీఈఆర్టీ సిలబస్‌తో 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరి కోసం విద్యాశాఖ అధికారులు 3,450 పరీక్షా కేంద్రాలను ఇప్పటికే సిద్ధం చేశారు.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లూ చేశారు. ఒత్తిడి, ఆందోళనకు గురి కాకుండా విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాయాలని అధికారులు సూచిస్తున్నారు.లీడర్ వరల్డ్ న్యూస్ తరఫున ఈరోజు నుంచి పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్..!
Share