Current Date: 17 Mar, 2025

రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్...

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత మూడేళ్లలో తొలిసారి ఢిల్లీలో గాలి నాణ్యత  గణనీయంగా మెరుగుపడింది. శనివారం నమోదైన గాలి నాణ్యత సూచీ  85గా నమోదైంది. ఇది జనవరి 1 నుంచి మార్చి 15 మధ్య కాలంలో గత మూడేళ్లలో నమోదైన అత్యల్ప స్థాయి కావడం విశేషం. దీంతో కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ 2025లో తొలిసారిగా ఢిల్లీ గాలి నాణ్యత 'సంతృప్తికరమైన  విభాగంలోకి చేరుకుందని ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో ఇదే అత్యల్ప స్థాయి. ప్రస్తుత సంవత్సరంలో 'సంతృప్తికరమైన' గాలి నాణ్యత నమోదైన మొదటి రోజు ఇది" అని తెలిపింది. దీనికి ముందు 2020 తర్వాత మార్చి నెలలో తొలిసారిగా ఢిల్లీలో 'సంతృప్తికరమైన' గాలి నాణ్యత నమోదైంది. ఇప్పుడు మళ్లీ అదే మార్చిలో మెరుగైన గాలి నాణ్యత నమోదు కావడం విశేషం. భారత వాతావరణ శాఖ ప్రకారం, మార్చి 15 నుంచి 17 మధ్య ఉత్తర కర్ణాటకలో ఉష్ణోగ్రత 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. మరింతగా, మార్చి 18-19 తేదీలలో తీవ్ర వేడిగాలులు ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం ప్రకారం కలబురగి, బీదర్, బాగల్‌కోట్, రాయచూర్, యాద్గిర్, విజయపుర జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Share