Current Date: 17 Mar, 2025

రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు సహా అనేక ఆర్ధిక సంస్థల నుంచి నిధులను సమీకరిస్తున్న విషయం తెలిసిందే. రెండు ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. దీంతో అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను సీఆర్డీఏ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మోదీని అహ్వానించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

Share