స్టార్ యాంకర్ అనసూయ ఈ మధ్యన సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అడపా దడపా మాత్రమే టీవీషోల్లో సందడి చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. తన సోషల్ మీడియా పోస్టులపై ట్రోల్స్ వచ్చినా అస్సలు వెనక్కు తగ్గదీ అందాల తార. తనను విమర్శించే వారికి తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి సంఘటనే మరొకటి జరిగింది. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగిన నేపధ్యంలో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఈ వేడుకల్లో భాగమయ్యారు. తమ కుటుంబీకులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి రంగుల పండగలో మునిగి తేలారు. అలా అనసూయ కూడా ఒక హోలీ ఈవెంట్ లో పాల్గొంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్‌గా వెళ్లిందామె. అయితే అక్కడ ఓ ఆకతాయి అనసూయను ఆంటీ అని పిలిచాడు. అంతే.. ఆ మాట చెవిన పడటంతో అనసూయకు చిర్రెత్తిపోయింది. అందరి ముందే ఆ ఆకతాయికి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. దమ్ముంటే స్టేజీపైకి రా అని సవాల్ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని ధమ్కీ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది.
Share