సునీతా విలియమ్స్ తిరిగి భూమిపైకి వచ్చేది ఎప్పుడో తెలుసా?...
Mar 16, 2025
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు. నాసా ప్రకారం.. భూమి మీదకు ఈ నెల 19, 20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది. 10 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్న ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. గత కొన్నినెలల క్రితమే 58 ఏళ్ల సునీతా విలియమ్స్, 61 ఏళ్ల విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో అంతరిక్షానికి పయనమైయ్యారు. కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు సునీతా, విల్‌మోర్ స్పేస్‌కు వెళ్లారు. కానీ, ఊహించని పరిణామాలతో జూన్ 5న ఫ్లోరిడాలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.