Current Date: 18 Mar, 2025

అప్పటివరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్న విజయశాంతి...

ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కొన్నాళ్ల క్రితం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ రామ్ తో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాతో మళ్ళీ రానుంది. అప్పట్లో విజయశాంతి అంటే కమర్షియల్ సినిమాలతో పాటు పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో కూడా మళ్ళీ విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించబోతుంది. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. సినిమా రిలీజయి బ్లాక్ బస్టర్ అయ్యాక చేపల పులుసు చేసి ఇస్తాను అని చెప్పాను. ఈ సినిమా మొదలయినప్పుడు విజయశాంతి ఒక మొక్కు మొక్కుకుంది. రిలీజయ్యాక తిరుమల వెళ్లి కాలినడకన వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటాము. అప్పటి వరకు నాన్ వెజ్ తినను అని మొక్కుకున్నారు. అది అయ్యాక అమ్మకి నేనే చేపల పులుసు చేసి పెడతాను అని తెలిపారు. ఇన్నేళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చి ఒక సినిమా కోసం హిట్ అవ్వాలని ఇలా మొక్కుకున్నారు అంటే విజయశాంతికి సినిమా అనే ఎంత ఇష్టమో తెలుస్తుంది.

Share