అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప: రి రూల్’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల వాటా ఎక్కువ ఉన్నట్లు సమాచారం. అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూళ్లు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది.ప్రీ సేల్ బుకింగ్స్ నుంచే బుక్ మై షోలో ‘పుష్ప 2’ దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మరోసారి హవా చూపింది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి. గతంలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గంటలో 97700 టికెట్స్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ఆ మార్క్‌ను పుష్పరాజ్ దాటేశాడు. సుకుమార్ టేకింగ్‌కు అల్లు అర్జున్ యాక్షన్‌కు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.జాతర, క్లైమాక్స్ సన్నివేశాల్లో బన్నీ తన నట విశ్వరూపం చూపించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన ఆశ్చర్యపరిచిందని అంటున్నారు.
Share