Current Date: 16 Mar, 2025

అమెరికాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు...

అమెరికాలో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 7.0గా న‌మోదైంది. ఉత్తర కాలిఫోర్నియా తీరంలో ఈ భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. దీంతో యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే యెల్లో అల‌ర్ట్ ప్ర‌క‌టించింది. అలాగే యూఎస్‌ నేషనల్ వెదర్ సర్వీస్  సునామీ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే ప్రకారం, గురువారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:44 గంటలకు ఉత్తర కాలిఫోర్నియాలోని హంబోల్ట్ కౌంటీలో 100 కిమీ వాయువ్య ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. ఇక కాలిఫోర్నియాలో సుమారు 5.3 మిలియన్ల మంది ప్రజలు యూఎస్‌ నేషనల్ వెదర్ సర్వీస్ జారీ చేసిన సునామీ హెచ్చరికలో ఉన్నారు. ఒరెగాన్ స్టేట్ లైన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా వరకు ఈ సునామీ హెచ్చరికలు ఉన్నాయి.

Share