Current Date: 16 Mar, 2025

పుష్ప‌-2' మొద‌టి రోజు వ‌సూళ్లు ...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా చిత్రం పుష్ప‌-2.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. బ‌న్నీ వ‌న్‌మెన్ షోతో మ‌రోసారి మెస్మ‌రైజ్ చేశారు. సుక్కు టేకింగ్ ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిపించింది.  ఇక ప్రీ సెల్ బుకింగ్స్ లోనే దూసుకెళ్లిన ఈ చిత్రం మొద‌టి రోజు వ‌సూళ్ల‌లోనూ హ‌వా చూపించిన‌ట్లు స‌మాచారం. బుధ‌వారం రాత్రి నుంచి థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన పుష్ప‌-2 ఓవ‌ర్సీస్‌లోనూ కలెక్ష‌న్ల ప‌రంగా టాప్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా సుమారు రూ. 175కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేశాయి. కాగా, అమెరికాలో పుష్ప‌-2 మొద‌టి రోజు దాదాపు 4.2 మిలియ‌న్ డాల‌ర్లు అంటే రూ. 35కోట్లు కొల్ల‌గొట్టిన‌ట్లు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ వెల్ల‌డించింది. ఈ మేర‌కు పోస్ట‌ర్ విడుద‌ల చేసింది. అగ్ర‌రాజ్యంలో ఈ స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధించిన మూడో భార‌తీయ చిత్రంగా పుష్ప‌-2 నిలిచింద‌ని తెలిపింది.

Share