మాజీ సీఎం వైయస్ జగన్‌కు జ్ఞానోదయం అయినట్లు తెలుస్తోంది. వైసీపీ కార్యకర్తల్ని విస్మరించి ఘోరంగా దెబ్బతిన్న జగన్.. తిరిగి యాక్టీవ్ చేసుకోవాలనే తలంపులో ఆయన ఉన్నారు. అధికారంలో ఉండగా వైసీపీ కార్యకర్తల్ని ఆయన పట్టించుకులేదనే అపవాదు ఉంది. ప్యాలెస్‌కే పరిమితమైన జగన్‌కు బుద్ధి చెప్పాలనే సొంతవాళ్లు కూడా ఆయనకు వ్యతిరేకంగా పని చేశారు. వాలంటీర్లు ఉన్నారులే, ఇక తనకు కార్యకర్తలతో పనేం వుందని జగన్ అనుకున్నారు. కనీసం కార్యకర్తలు, నాయకుల్ని పలకరించిన పాపాన పోలేదు. వాళ్ల ఇబ్బందుల్ని పట్టించుకోలేదు. దీంతో తామెందుకు జగన్ కోసం ఎప్పుడూ పని చేయాలన్న వ్యతిరేకత ఏర్పడింది. జగన్ నెత్తిన పెట్టుకున్న వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు వైసీపీ గెలవాలని అనుకోలేదు. చంద్రబాబు రూ.10 వేలు ఇస్తానంటే, చాలా మంది వాలంటీర్లు ప్లేట్ ఫిరాయించేశారు. ఘోర పరాజయం తర్వాత జగన్‌కు జ్ఞానోదయం అయ్యినట్టుంది. ఇప్పుడాయనకు కార్యకర్తలు గుర్తు వస్తున్నారు. సంక్రాంతి తర్వాత కార్యకర్తల వద్దకు వెళ్తున్నారు. పోగొట్టుకున్న చోటే అధికారాన్ని వెతుక్కోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Share