Current Date: 05 Oct, 2024

వన్యప్రాణుల అక్రమ రవాణా, అటవీ ఉద్యోగులపై దాడులపై కఠిన చర్యలు

వన్యప్రాణులను అక్రమంగా రవాణా చేసే వారిపై, అలాగే అటవీ శాఖ ఉద్యోగులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పల్నాడు జిల్లాలోని విజయపురి సౌత్ రేంజ్ పరిధిలో వన్య ప్రాణి అలుగు (పంగోలియన్)ను అక్రమంగా రవాణా చేసే ముఠాను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అటవీ శాఖ ఉద్యోగులపై జరిగిన దాడిని మంగళవారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. అటవీ శాఖ ఉన్నతాధికారులకు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం అరణ్య భవన్ లో జరిగిన గ్లోబల్ టైగర్ డే కార్యక్రమంలో ఒంగోలులో అలుగును కొందరు వ్యక్తులు కొట్టి చంపిన సంఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. విజయపురి సౌత్ అధికారులపై జరిగిన దాడి ఘటనపై పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, ఘటన యొక్క పూర్వాపరాలను తెలుసుకుని, దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో ప్రజలకు అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

Share