ఏపీ కేబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ మీటింగ్ హాలులో వచ్చే నెల 4వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించే ప్రతిపాదనలు డిసెంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా పంపాలని వివిధ శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ అమలులో లోటు పాట్లు, సూపర్ సిక్స్ పథకాలు, కొత్త రేషన్ కార్డుల మంజూరు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్‌తో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Share