అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలం రాజవొమ్మంగి గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామంలోని సైడు కాలువల్లో మురుగు పేరుకుపోయి నీటిపారుదల ఆగిపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ సర్పంచ్ గొల్లపూడి ఆదేశాల మేరకు పంచాయతీ సిబ్బంది మినీ జెసిబి తో వీధి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కాలువలలోని మురుగు, చెత్తా చెదారాన్ని తొలగించారు. దీనివల్ల మరిన్ని పారిశుద్ధ్య సమస్యలు, ఇబ్బందులు కలగకుండా ఆ చెత్తను అక్కడ నుంచి ట్రాక్టర్ సహాయంతో డంపింగ్ యార్డ్ కు తరలించారు. ఈ పారిశుధ్య పనులను మండల టిడిపి అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు పర్యవేక్షణలో దగ్గరుండి పంచాయతీ సిబ్బందితో పనులు చేయిస్తున్నారు.
Share