దక్షిణాఫ్రికా పర్యటనలో శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 13.5 ఓవర్లలో 42 పరుగులకే కుప్పకూలింది. సఫారీ పేసర్ మార్కో జాన్సెన్ ఏడు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. కొయెట్జీ రెండు వికెట్లు తీయగా, రబాడ ఓ వికెట్ సాధించాడు. గత వందేళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో 83 బంతుల్లో ఓ జట్టు ఆలౌట్ కావడం ఇదే తొలి సారి. గతంలో 1924లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 75 పరుగులకే ఆలౌటైంది. కాగా.. టెస్టు క్రికెట్‌లో లంకకు ఇదే అత్యల్ప స్కోరు. గతంలో 1994లో పాకిస్థాన్ పై 71 పరుగులకు ఆలౌటైంది.