Current Date: 29 Nov, 2024

బాల్య వివాహ రహిత మండలంగా లక్ష్యం

బాల్య వివాహాల రహిత మండలం గా లక్ష్యం కావాలని సిడిపిఓ దేవామణి పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్తభారత్‌ కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ మాట్లాడుతూ అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో బాల్యవివాహాల రహిత మండలం గా రూపాంతరం చెందుటకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చిన్నారులకు బాల్యవివాహాలు చేయకుండా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రథమ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డెన్, సూపర్వైజర్ అరుణ, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. 

Share