Current Date: 29 Nov, 2024

ఒక్క ట్వీట్‌తో బాంబ్ పేల్చిన ఆర్జీవీ.. 3 రోజుల ప్రచారానికి పుల్‌స్టాప్

టాలీవుడ్  డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ కేసులకు భయపడి పరారీలో ఉన్నారని అనుకునే వారి కోసం ఆయన సుదీర్ఘమైన ట్వీట్‌ చేశారు. ఇదే క్రమంలో తనపై పెట్టిన కేసులు వాటి సెక్షన్ల వివరాలను పొందుపరిచారు. తాను చేసిన తప్పేంటి..? పోలీసులు నమోదు చేసిన కేసు ఏంటి..? అనేది అందరికీ అర్థం అయ్యేలా తెలుపుతూ.. తన సోషల్‌ మీడియాలో భారీ ట్వీట్‌ చేశారు. వర్మ భయపడి పరారీలో ఉన్నారనుకునే వారికి ఆయన పెద్ద షాకిచ్చారని చెప్పవచ్చు. అలాంటి ప్రచారాలతో ఆనందపడి సెలబ్రేట్‌ చేసుకునే వారికి బ్యాడ్‌ న్యూస్‌ చెప్పారు. ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నారో తెలుపుతూ.. సుమారు 20కి పైగా పాయింట్లతో ఒక ట్వీట​్ వేశారు. ‘‘పోలీసులు ఇంత వరకు నా ఆఫీసులోకి కాలే పెట్టలేదు.. పైగా నన్ను అరెస్టు చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు.  ఒక వేళ నన్ను అరెస్టు చేయడానికే వస్తే నా ఆఫీసులోకి ఎందుకు రారు..? నేను పరారీలో  ఉన్నాను అనేవి అన్ని అబద్ధాలు.. ఇక నేను నా మొబైల్ ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయటానికి ప్రధాన కారణం, లెక్కలేనన్ని  మీడియా కాల్స్, ఇంకా పరామర్శ కాల్స్ ఇవన్నీ  నా పనిని డిస్టర్బ్ చేస్తాయి 

Share