తాజాగా రామ్ చరణ్ భార్య ఉపాసన జాన్వీ కపూర్ కి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఉపాసన, చిరంజీవి భార్య సురేఖ కలిసి అత్తమ్మాస్ కిచెన్ అని ఇన్‌స్టంట్ ఫుడ్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ సి16 సినిమా మొదలయిన సమయంలో జాన్వీ కపూర్ చరణ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఉపాసన ఈ అత్తమ్మాస్ కిచెన్ నుంచి పలు ఇన్‌స్టంట్ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్న గిఫ్ట్ బాక్స్ జాన్వీకి ఇచ్చింది. జాన్వీకి ఉపాసన ఈ గిఫ్ట్ బాక్స్ ఇచ్చిన ఫోటోని ఇప్పుడు అత్తమ్మస్ కిచెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటో పోస్ట్ చేసి ఆర్ సి16 సెట్స్ లో ఏం వండుతున్నారో తెలుసా.. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసారు.