తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు శుభవార్త చెప్పింది. పలు శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను శుక్రవారం అందుబాటులోకి తేనుంది. శ్రీవారి కళ్యాణం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవల జూన్ నెల కోటా టికెట్లు శుక్రవారం అందుబాటులోకి రానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు భక్తులు ఆన్‌లైన్ ద్వారా టికెట్లను పొందొచ్చు. ఆన్‌లైన్ సేవలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఉజ్వల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్రదీపాలంకరణ సేవల టికెట్లు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి. 2025, జూన్ 9వ తేదీనుంచి 11వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం సేవకు సంబంధించిన టికెట్లు కూడా శుక్రవారం ఉదయం 10 గంటలకు అందుబాటులోకి రానున్నాయి.