ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఓ పక్క ఎండ తీవ్రత, మరోవైపు పిడుగుపాటు సంభవించే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమై ఉండి పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండడంతో పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.