Current Date: 26 Mar, 2025

వీరిద్దరిలో పెద్ద రౌడీ ఎవరు?..మోహన్‌బాబు, ఆర్జీవీ?? సంచలన కామెంట్స్ చేసిన విష్ణు

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, సీనియర్ నటుడు మోహన్ బాబు కలిసి ముచ్చటించుకుంటున్న ఫొటోను నటుడు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా వారి పేర్లను కూడా మార్చేశారు. ‘‘ఈ ఇద్దరితో సాయంత్రం వైల్డ్‌గా సాగింది. మోహన్‌బాబు వర్మ, మంచు రాంగోపాల్. వీరిలో పెద్ద రౌడీ ఎవరు? అని ఫ్యాన్స్‌ను ప్రశ్నించారు. కాగా, విష్ణు, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో ‘రౌడీ’ అనే సినిమాను వర్మ రూపొందించారు. అలాగే, విష్ణు హీరోగా ‘అనుక్షణం’ సినిమా తీశారు. 2014లో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి.

Share