Current Date: 26 Mar, 2025

ఉప్ప‌ల్ స్టేడియంలో త‌మ‌న్ మ్యూజిక‌ల్ ఈవెంట్‌

మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉప్ప‌ల్‌ స్టేడియానికి వెళ్లే ప్రేక్ష‌కుల‌కు గుడ్‌న్యూస్‌. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ నేతృత్వంలో మ్యూజిక‌ల్ ఈవెంట్ ఉండ‌నుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ త‌న సంగీత కార్య‌క్ర‌మంతో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నున్నారు. ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విష‌యాన్ని ప్రకటించింది. కాగా, ఈసారి దేశ‌వ్యాప్తంగా ఐపీఎల్ జ‌రుగుతున్న ప‌లు స్టేడియాల్లో మ్యాచ్‌కు ఇదే త‌ర‌హాలో మ్యూజిక‌ల్ ఈవెంట్స్‌ను బీసీసీఐ నిర్వ‌హిస్తోంది. ఇదిలాఉంటే... ఐపీఎల్ 18వ సీజ‌న్‌ను గ్రాండ్ విక్ట‌రీతో ఎస్ఆర్‌హెచ్ శుభారంభం చేసింది.

Share