Current Date: 26 Mar, 2025

సీనియ‌ర్ న‌టుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ గురువు కన్నుమూత‌

ప్ర‌ముఖ కోలీవుడ్ న‌టుడు షిహాన్ హుసైని అనారోగ్యంతో క‌న్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయ‌న బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ చెన్నైలోని ఓ ఆసుప‌త్రిలో చేరారు. అక్క‌డ చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచిన‌ట్లు కుటుంబ స‌భ్యులు తెలిపారు. హుసైని మరణ వార్తపై సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఆయ‌న 1986లో విడుద‌లైన  'పున్నగై మన్నన్‌' అనే చిత్రం ద్వారా కోలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మయ్యారు. ఆ త‌ర్వాత అనేక చిత్రాల్లో నటించినప్పటికీ, విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'బద్రి' సినిమా ద్వారా ఆయనకు విశేష గుర్తింపు లభించింది. కాగా, హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు హుసైని మార్ష‌ల్ ఆర్ట్స్, క‌రాటే, కిక్ బాక్సింగ్ వంటి యోధ కళల్లో శిక్షణ అందించారు. ఆయ‌న ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుంటూనే ప‌వ‌న్ బ్లాక్ బెల్ట్ సాధించారు.

Share