Current Date: 26 Mar, 2025

తిరుమలలో కొత్త రూల్స్.. ఫాలో కావాల్సిందే

కలియుగ దైవం కొలువుండే చోటు. కొన్ని సెకన్ల పాటు.. వెంకటేశ్వర స్వామిని చూస్తే చాలు జన్మ పునీతం అనుకునే భక్తులు ఎందరో! దేశం నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు తిరుమలకు పోటెత్తుతుంటారు. అలాంటి తిరుమలలో ఐదేళ్లు విధ్వంసం జరిగిందని.. పవిత్రతకు భంగం కలిగిందని.. దాన్ని కాపాడడమే లక్ష్యం అంటోంది కూటమి సర్కార్‌. సీఎం చంద్రబాబు టాప్ ప్రియారిటిగా ఉన్న టీటీడీలో పాలన అత్యంత పారదర్శకంగా ఉండాలన్నదే లక్ష్యం. ఆ దైవం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందనే విశ్వాసం చాలామందిది. కొన్ని క్షణాల పాటు.. వెంకన్న దర్శనంకోసం దేశవిదేశాల నుంచి వచ్చేది అందుకే. ఐతే అలాంటి దైవం కొలువైన తిరుమల కొండపై.. ఐదేళ్లు అపచారం జరిగిందని.. పవిత్రతకు భంగం కలిగిందని.. కూటమి సర్కార్ మొదటి నుంచి ఆరోపిస్తోంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తిరుమల ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీంతో ప్రసాదాల తయారీలో నాణ్యత, భక్తులకు అందించే సేవలు.. గతంతో కంపేర్ చేస్తే మెరుగుపడినట్లు భక్తులు చెప్తున్నారు. ఐతే ఇప్పుడు తిరుమల పవిత్రతను కాపాడేలా మరిన్ని కీలక నిర్ణయాలకు సిద్ధం అవుతున్నారు.

Share