హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ప్రభుత్వ ఖర్చు రూ. 27 కోట్లు...
Mar 21, 2025
హైదరాబాద్‌లో మే 7 నుంచి 24 రోజులపాటు జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం రూ. 27 కోట్లు ఖర్చు చేయనుంది. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా, మే 31న హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈ పోటీల్లో మొత్తం 140 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొంటారు. ఈ పోటీలకు మొత్తంగా రూ. 54 కోట్లు ఖర్చు కానుండగా, ప్రభుత్వ శాఖలు తమ వాటాగా రూ. 27 కోట్లు ఖర్చు చేయనున్నాయి. మిగతా రూ. 27 కోట్లను మిస్ వరల్డ్ సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రభుత్వ వాటాగా ఉన్న రూ. 27 కోట్లను స్పాన్సర్ల ద్వారా సమీకరిస్తారు.