న్యాయమూర్తులతో పాటు న్యాయవాదులు కూడా న్యాయవ్యవస్థలో ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహి స్తారని, న్యాయవాదులు లేకుండా న్యాయస్థానాలు లేవని, న్యాయవాది తన వృత్తి ధర్మాన్ని అనుసరించి తనను ఆశ్రయించిన బాధితులకు న్యాయం చేయడానికి సాయ శక్తుల కృషి చేస్తాడు. అయితే ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, దాడి చేసి న్యాయవాదులను లొంగ తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, AP ఆదివాసి సంఘం గౌరవ సలహాదారు పి.స్. అజయ్ కుమార్ అన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న కోర్టులన్నీ అద్దె భవనంలో నడుస్తున్నాయని అక్కడ పరిస్థితులు అటు న్యాయమూర్తులకు, ఇటు న్యాయవాదులకు, మారో వైపు కక్షిదారులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, మరీ ముఖ్యంగా న్యాయస్థానాలలోని మహిళా సిబ్బంది, మహిళా న్యాయవాదులు, మహిళా కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం తక్షణం స్థలాన్ని కేటాయించి కోర్టుల సముదాయాన్ని నిర్మించవలసిన అవసరం ఉందని అజయ్ కుమార్ అన్నారు.
Share