ఖాద్రీ లక్ష్మీనర సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లోభాగంగా గురువారం కదిరిలో ఖాద్రీ లక్ష్మీనారసింహుడి బ్రహ్మరథోత్సవం జరగనుంది. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఉచిత రవాణా, భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లను అధికారులు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.