Current Date: 21 Mar, 2025

అన్నకు అవార్డు రావడంపై... పవన్ కల్యాణ్ ఎమోషనల్ ట్వీట్...

మెగాస్టార్ చిరంజీవి అరుదైన అవార్డును అందుకున్నారు. సుమారు 40 ఏళ్లకు పైగా తెలుగు సినిమా రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలనుగానూ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని అందుకున్నారు మెగాస్టార్. యూకేకు చెందిన అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా.. చివరంజీవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ పురస్కారం అందుకున్న అన్న చిరంజీవికి తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందలను తెలియజేశారు. ట్వీట్టర్ వేదికగా చిరు అవార్డుపై పవన్ స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చిరుకు తమ్ముడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని పురస్కరాలు అందుకోవాలని పవన్ ఆకాంక్షించారు. మీ తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య గారి కీర్తిని మరింత పెంచనుంది. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌ వేదికగా పవన్ ట్వీట్ చేశారు.

Share