ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసిన ఎమ్మెల్యే బేబీనాయన
Mar 20, 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు అమరావతిలో కలిసి గొల్లాది వంతెన ఆవశ్యకతను గురించి వివరించారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గొల్లాది గ్రామంలో వేగావతి నదిపై వంతెన నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా రా కదలిరా సభలో మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ప్రస్తుత విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శంఖారావం సభలో మాట ఇచ్చినట్లు గుర్తుచేస్తూ, ఆ వంతెన నిర్మాణం వలన కేవలం బొబ్బిలి బాడంగి ప్రాంతమే కాకుండా రాజాం మండలం,గజపతినగరం నియోజకవర్గంలో దత్తిరాజేరు, చీపురుపల్లి నియోజకవర్గంలో మెరకముడిదాం గ్రామాలతో పాటు బొబ్బిలి మరియు పార్వతీపురం మన్యం జిల్లాల అనుసంధానానికి ఉపయోగపడుతుందని బేబీ నాయన తెలియజేశారు.