Current Date: 28 Mar, 2025

చిరంజీవిని కలిసేందుకు డబ్బులు వసూలు.. మెగాస్టార్ ఫైర్

మెగాస్టార్ చిరంజీవికి లండన్ టూర్‌లో చేదు అనుభవం ఎదురైంది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఘనంగా చిరంజీవిని సత్కరించి.. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ప్రదానం చేశారు. అయితే.. అక్కడ చిరంజీవిని కలుసుకునేందుకు ఫ్యాన్‌ మీట్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేశారు. ఇది కాస్తా చిరు దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎప్పుడు, ఎక్కడా కూడా నేను ఇలాంటి వాటిని ప్రోత్సహించనని గుర్తించండి. మన మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం వెలకట్టలేనిది. నేను ఇలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ అస్సలు ఒప్పుకోను. మన ఆత్మీయ కలయికలను స్వచ్ఛంగా, స్వలాభార్జనకు దూరంగా ఉంచుదాం అని ట్విట్టర్‌లో చిరంజీవి పోస్టు పెట్టాడు.ప్రియమైన అభిమానులారా..! యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపిన ప్రేమ, వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. ఈ క్రమంలో ఫ్యాన్‌ మీటింగ్‌ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను అస్సలు ఒప్పుకోను. దీన్ని ఖండిస్తున్నా. ఫ్యాన్స్‌ మీటింగ్‌ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వెంటనే తిరిగి వారికి ఇచ్చేయండి. 

Share