కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు.. ఆపద మొక్కుల స్వామి. అందుకే క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలు అన్నది భక్తుల ఆశ. అందుకే ఎన్నో వ్యయ ప్రయాసలు లెక్క చేయక శ్రీవారి దర్శనం కోసం పరితపిస్తారు. శ్రీవారి నిత్య నైవేద్యాలు, ప్రసాదాల పరమ పవిత్రంగా భావిస్తుంటారు. అలాంటి ప్రసాదాల కోసం సరఫరా చేసిన సేంద్రియ ఉత్పత్తుల బండారం బయట పడింది. ఆర్గానిక్ సరుకుల వ్యవహారంలో డొంక కదిలింది. నిబంధనలకు విరుద్ధంగా దాతలకు ప్రయోజనాలు చేకూర్చినట్లు తేలడంతో టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్గానిక్ ప్రసాదాల తయారీని నిలిపి వేసిన టీటీడీ అంతులేని ప్రయోజనాలను పొందిన దాతలకు చెక్ పెట్టింది. ఆర్గానిక్ సరుకులు సరఫరా చేసినట్లుగా ప్రివిలైజ్ పాసు పుస్తకాలు పొందిన దాతల ప్రయోజనాలను టీటీడీ కట్ చేసింది. ఇకపై ఆ దాత నుంచి ఎలాంటి దానాలు అక్కర్లేదన్న నిర్ణయాన్ని ప్రకటించిన టీటీడీ ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టింది. డొనేషన్లుగా సరుకులు సరఫరా చేసి ప్రివిలేజ్‌గా పాసు పుస్తకాలు పొంది టీటీడీ ని బురిడీ కొట్టించిన దాతపై చర్యలకు సిద్ధమైంది.
Share