రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారు.. వేడి గాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. మే నెలలో కనిపించాల్సిన ఎఫెక్ట్.. మార్చిలోనే కనిపిస్తుండటంతో.. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం బెంబేలెత్తుతున్నారు. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి..రోజురోజుకు ఉష్ణోగ్రతలో తీవ్రత పెరిగిపోతోంది. వేడిగాలుల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిలోలో 20, పార్వతీపురం మన్యంలో14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 3, తూర్పుగోదావరి జిల్లాలోని 5 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Share