ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబతో కలిసి ఈరోజు తిరుమలకు వెళ్లనున్నారు. శుక్రవారం దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున శ్రీవారి సన్నిధికి చంద్రబాబు కుటుంబం వస్తోంది. వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించి ఒక్కరోజుకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలను టీటీడీకి విరాళంగా చంద్రబాబు ఫ్యామిలీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏటా దేవాన్ష్ పుట్టినరోజున చంద్రబాబు ఫ్యామిలీ ఇదే పద్ధతి అనుసరిస్తోంది. గత ఏడాది చంద్రబాబు జైలు నుంచి బయటికి రాగానే నేరుగా తిరుమలకి వెళ్లారు. అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లారు.
Share