Current Date: 21 Mar, 2025

ఈరోజు స్టేషన్‌కి 17 మంది సినీ సెలెబ్రిటీలు.. అరెస్ట్ చేస్తారా?

తెలుగు రాష్ట్రాల్లో పలువురు యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు, సినీ సెలెబ్రిటీలు గురువారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేసి కేసులు ఎదుర్కొంటున్న ఈ 17మందిపై కేసు నమోదు కాగా, నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు పోలీసులు నోటీసులిచ్చారు. పోలీసులు.. కేసులు.. నోటీసులు ఇవ్వగానే చాలా మంది క్షమాపణలు చెప్పారు. కానీ.. వీరి ప్రమోషన్లతో అమాయక ప్రజలు బెట్టింగ్ భూతానికి బలి అవుతున్నారని సజ్జనార్ ఫిర్యాదు చేయడంతో వీరిపై కేసు నమోదు చేసి.. పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు. కొంత మంది ఇప్పటికే పరారీలో ఉండటంతో.. అరెస్ట్ చేసే అవకాశాలూ లేకపోలేదు.

Share