నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి 286 రోజుల తర్వాత ఎట్టకేలకు వారిద్దరూ పుడమిపైకి తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. సునీతా, విల్మోర్ ప్రయాణం ఆదర్శప్రాయమైన మానవ సంకల్పం, జట్టు కృషిని చూపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. వారిద్దరూ తిరిగొచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. వ్యోమగాముల బలం, పట్టుదలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. సునీత విలియమ్స్, బారీ విల్మోర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు.
Share